హాట్‌బ్యూటీ 12కోట్ల రెమ్యున‌రేష‌న్‌

Saturday, June 9th, 2018, 01:05:18 AM IST

బాలీవుడ్‌ని రెండు ద‌శాబ్ధాలుగా త‌న‌దైన ఛ‌రిష్మాతో ఏల్తోంది హాట్ బ్యూటీ క‌త్రిన కైఫ్‌. మ‌ల్లీశ్వ‌రి త‌ర‌వాత ఒక‌ట్రెండు తెలుగు సినిమాల్లో న‌టించిన క‌త్రిన అటుపై బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్క‌డ ఏకంగా స‌ల్మాన్ ఖాన్ అండ‌దండ‌ల‌తో కెరీర్‌ని మ‌లుచుకుంది. ఆ క్ర‌మంలోనే ర‌ణ‌వీర్‌తో ఎఫైర్, బ్రేక‌ప్‌.. అటుపై తిరిగి స‌ల్మాన్ గూటికి చేరిన వ్య‌వ‌హారం తెలిసిందే. అదంతా అటుంచితే ఇంత సీనియర్ అయినా క‌త్రిన ఇప్ప‌టికీ మెరుపు తీగ రూపం మెయింటెయిన్ చేస్తూ ఏకంగా యాక్ష‌న్ హీరోయిన్‌గా ఎదిగిన తీరు మ‌హ‌దాద్భుతం అనే చెప్పాలి. ఇటీవ‌లి కాలంలో క‌త్రిన ఏ సినిమాలో న‌టించినా ఆ సినిమాకి త‌నో పెద్ద అస్సెట్ అవుతోంది. దూమ్ 3లో అదిరిపోయే స‌ర్క‌స్ ఫీట్స్‌తో మ‌తిచెడ‌గొట్టింది. ఇటీవ‌లే టైగ‌ర్ జిందా హై చిత్రంలో పాకిస్తానీ ఇంటెలిజెన్స్ అధికారిగా మెరుపు ఫైట్స్ తో అద‌ర‌గొట్టేసింది. స్వాగ్ సే స్వాగ‌త్ పాట‌లో మ‌తిచెడే స్టెప్పుల‌తో మ‌త్తెక్కించింది.

వజ్రం సాన‌ప‌ట్టే కొద్దీ మెరుస్తుంది! అన్న చందంగా క‌త్రిన కెరీర్ ప‌రంగా ఇంకా ఇంకా హైట్స్‌కి వెళుతోంది. అయితే ఇంత సాధించింది క‌దా? అస‌లు త‌న పారితోషికం ఎంత‌? అని ప్ర‌శ్నిస్తే.. షాకిచ్చే ఆన్స‌ర్ వ‌చ్చింది. క‌త్రిన కైఫ్ ఒక్కో ప్రాజెక్టుకు 12కోట్ల పారితోషికం అందుకుంటోంది. ఇప్ప‌టికిప్పుడు షారూక్ ఖాన్ `జీరో`లో న‌టిస్తోంది. అలానే స‌ల్మాన్ స‌ర‌స‌న ద‌బాంగ్ 3 చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమాల‌కు భారీ పారితోషికం ఖాతాలో వేసుకుంటోంది. ఇక క‌త్రినతో పోలిస్తే స‌గం కెరీర్ అయినా చూడ‌ని జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్‌, సోనాక్షి సిన్హా వంటి తార‌లు మినిమంగా 6-8 కోట్ల పారితోషికం అందుకుంటూ షాకిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments