నాగిని సుర‌య .. అస‌లు గుట్టు లీక్‌!!

Sunday, September 30th, 2018, 01:47:03 PM IST

2018 మోస్ట్ అవైటెడ్ మూవీ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 8న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఈ సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌లే రిలీజై ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. హిందీ వెర్ష‌న్ ట్రైల‌ర్‌తో పాటు, తెలుగు, త‌మిళ వెర్ష‌న్ ట్రైల‌ర్ల‌ను టీమ్ రిలీజ్ చేసింది. ఈ ట్రైల‌ర్‌లో అమితాబ్‌, అమీర్ పాత్ర‌ల‌తో పాటు క‌త్రిన‌ సుర‌య పాత్ర‌ధారి ప్ర‌త్యేకంగా క‌నిపించింది. ఇంత‌కీ ఈ పాత్ర ధూమ్ 3, టైగ‌ర్ జిందా హై త‌ర‌హా యాక్ష‌న్ పాత్ర‌నా? స‌స్పెన్స్ ఏదైనా ఉంటుందా? అంటే అలాంటిదేం లేద‌ని క‌త్రిన క‌రాఖండిగా చెప్పేసింది.

ట్రైల‌ర్ వేడుక‌లో క‌త్రిన మాట్లాడుతూ – “యాక్ష‌న్ క్వీన్ ని కాదు. క‌థ‌ను న‌డిపించే ఎంతో ఇంపార్టెంట్ పాత్ర అది. సినిమా ఆద్యంతం కీల‌క స‌న్నివేశాల‌తో ముడిప‌డిన పాత్ర సుర‌య పాత్ర. టైగ‌ర్ జిందా హై త‌ర‌హాలో స్టంట్స్ చేయ‌ను“ అని చెప్పింది. `ధూమ్ 3` త‌ర్వాత విజ‌య్‌కృష్ణ ఆచార్య‌తో క‌లిసి రెండో సినిమాకి ప‌ని చేశాన‌ని, విక్ట‌ర్ విజ‌న్ ఎంతో గొప్ప‌గా ఉంటుంద‌ని తెలిపింది. ఈ చిత్రంలో `దంగ‌ల్` పేం స‌నా షేక్ పాత్ర అంతే ప్ర‌త్యేక‌మైన‌ది. శ‌త్రువుపై లంఘించే బాణాలు సంధించే పాత్ర‌లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే.