దబాంగ్ టూర్ .. ప్రస్తుతం ఇంటా బయటా హాట్ టాపిక్. సల్మాన్ భాయ్ అరడజను గాళ్స్ నడుమ ఆడుతూ పాడుతూ చిలౌట్ చేస్తూ నానా హడావుడి చేస్తున్నాడు. టూర్లో భాయ్ వెంట ఎప్పుడూ మందీ మార్భలం ఉంటున్నారు. ఇకపోతే తాజాగా పూణేలో దబాంగ్ టూర్ గ్యాంగ్ చేస్తున్న డ్యాన్స్ రిహార్సల్స్ వీడియోలు లీకయ్యాయి. ఇందులో కత్రిన కైఫ్ అదరిపోయే డ్యాన్సులతో దుమ్ము రేపేస్తోంది.
మునుముందు విదేశాల్లో జరగనున్న ఈ టూర్లో క్యాట్ నృత్యాలు కేక పుట్టిస్తాయని తెలిసింది. ఇకపోతే ఇదిగో ఇక్కడ కత్రిన మెలికలు తిరుగుతూ చేసిన ఈ డ్యాన్సింగ్ విన్యాసాలు కుర్రాళ్ల కళ్లలోకి ఇంకిపోవడం ఖాయం. సందేహాలుంటే వీడియోలోకి కళ్లప్పగించి చూడొచ్చిక…