ఎన్టీఆర్ కామెంట్స్ పై కత్తి మహేష్ ఘాటు వ్యాఖ్యలు.. అవసరమా?

Tuesday, September 26th, 2017, 05:55:43 PM IST


ఒక సినిమా తీయాలంటే చిత్ర యూనిట్ సభ్యులు ఏ స్థాయిలో కష్టపడతారో తెలిసిన విషయమే. ప్రస్తుత రోజుల్లో కొందరు ప్రేక్షకులు ట్రైలర్ ని చూసి వెళితే మకొందరు అభిమాన నటీనటులు ఉన్నారనే కోణంతో అలోచించి వెళతారు. అయితే వేరే తరహాలో ఆలోచిందే మరికొందరు ప్రేక్షకులు క్రిటిక్స్ ను ఫాలో అవుతూ సినిమాను చూడటం లేదని కొందరు సినీ ప్రముఖులు ఆరోపిస్తున్నారు. రీసెంట్ గా ఇదే తరహాలో కొందరి క్రిటిక్స్ పై జూనియర్ ఎన్టీఆర్ కూడా తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సినిమా చూసేది ప్రేక్షకులని వారి చూసి నిర్ణయించాల్సింది దారిన పోయే ఎవడో కామెంట్ చేయడం సరికాదని కామెంట్స్ చేశారు.

అయితే ఈ కామెంట్స్ పై కత్తి మహేష్ స్పందించాడు. అయన మాట్లాడుతూ.. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ప్రేక్షకుడు కేవలం అనుభూతుని మాత్రమే చెబుతాడని, కానీ క్రిటిక్ తన ఆలోచనలను తెలుపుతాడని వివరించాడు. అంతే కాకుండా ప్రేక్షకుడికి ఉన్న హక్కు క్రిటిక్ కి లేదని ఎన్టీఆర్ అలా కామెంట్స్ చేయడం వాక్ స్వాతంత్ర్యానికి విరుద్ధమని చెప్పాడు. అలాగే క్రిటిక్స్ గురించి మాట్లాడుతూ.. అనవసరంగా తన లాంటి వారికి పాపులారిటీని తేవొద్దని చెప్పారు. అయితే ఎన్టీఆర్ కూడా తన ఆవేదనను మాత్రమే చెప్పాడని దానికి కత్తి మహేష్ అనవసరంగా ఈ తరహాలో కామెంట్ చేయాల్సిన అవసరం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక హీరోలపై కామెంట్స్ చేసి అభిమానుల మనోభావాలకు పరీక్ష పెట్టకూడదనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి.

Comments