స్టార్ హీరోలని గోకడమే కత్తి మెచ్చిన సుత్తి పని! ఇప్పుడు కులాల మీద!

Thursday, September 28th, 2017, 05:50:46 PM IST

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల మీద కామెంట్స్ చేస్తే మంచి పబ్లిసిటీ వస్తుందనే ఫీల్ అయ్యే కొందరు కావాలని అదే పనిగా ఏదో ఒక వంకతో స్టార్ హీరోల టార్గెట్ చేస్తూ, వారి ఫ్యాన్స్ తో చివాట్లు తింటూ మీడియా మొత్తం తనపై ద్రుష్టి పెట్టి, కావాల్సినంత హైప్ తీసుకొస్తే అది తృప్తి. ఈ మధ్య కాలంలో అలాంటి బాపతు షో కాల్డ్ గాళ్ళు సొసైటీలో ఎక్కువైపోయారు. ఇప్పుడు పబ్లిసిటీ కావడానికి ఫ్రేమ్ లోకి రావడానికి రైట్ రూట్ కంటే, కాస్తా నెగిటివ్ టచ్ ఉన్న వివాదాస్పద దారిలో వెళ్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో అలా ఓ వ్యక్తి తయారయ్యాడు. విమర్శల వెనక అతని ఉద్దేశ్యం ఏంటో తెలిసిన ప్రతి ఒక్కరికి అతనెవరో తెలుస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలని, వారు యాక్టివిటీస్ ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్న ఆ మధ్య పవన్ కళ్యాణ్ మీద, తాజాగా ఎన్టీఆర్ మీద కూడా తనదైన శైలిలో కామెంట్స్ చేసి. తన మీద కాస్తా కాన్సంట్రేషన్ పెరిగేలా చేసుకుంటున్నాడు. మీడియా కూడా అతను ప్రతి మాటలని బూతద్దంలో చూపిస్తూ అతనికి కావాల్సినంత హైప్ ఇస్తుంది.

ఇప్పుడు దీనిని అవకాశంగా తీసుకున్న ఆ షో కాల్డ్ సినిమా క్రిటిక్ స్టార్ హీరోలకి కులాల జాడ్యం అంటించే ప్రయత్నం చేస్తున్నాడు. కమ్మ హీరోలు, కాపు హీరోలు అంటూ వేరు చేసి. ఫ్యాన్స్ కావాలని సినిమా మీద నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని ఏదో తనకు తోచింది రాసేసి ఇంత వరకు తమకు నచ్చిన హీరోని అభిమానించుకుంటూ వెళ్ళిన కులాల మధ్య కుంపటి పెట్టి రసస్పందన పొందే ప్రయత్నంలో ఉన్నాడు. స్పైడర్ సినిమాలో విలన్ కి జనాల ఏడుపులు వింటే అదో ఆనందం. ఇక ఈ షో కాల్డ్ మేధావులకి కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు కొట్టుకుంటే అందులో ఆనందం ఉంటుందేమో అని స్టార్ హీరోల ఫ్యాన్స్ నుంచి ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. ఫ్యాన్స్ మధ్య వార్ ఉన్న అది కేవలం అభిమానం వరకే పరిమితం అవుతుంది తప్ప, సినిమాల మీద నెగిటివ్ పబ్లిసిటీ చేసే స్థాయిలో ఉండదు అనేది ఫ్యాన్స్ సంఘాల మాటలు, మరి ఈ షో కాల్డ్ మేధావికి మాటలపై స్టార్ హీరోలు స్పందిస్తారో, లేక వాళ్ళు స్పందించే వరకు ఎలా తన స్పందనలో వున్న భావాలని సోషల్ మీడియా ద్వారా రుద్దుతారో అనేది చూడాలి.

Comments