కత్తి మహేష్ ట్విట్టర్ ఖాతా మాయం?

Wednesday, April 25th, 2018, 02:18:36 AM IST

బిగ్ బాస్ షో తో బాగా పాపులర్ అయిన సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పై పలురకాల విమర్శలు చేసి పవన్ ఫాన్స్ ఆగ్రహానికి గురి అయిన కత్తి మహేష్ ఆ వివాదాన్ని సాగదీసి చాలా కాలమే నడిపాడు. అయితే చివరకు మొత్తానికి జనసేన కార్యాలయం నుండి దీనికి ఇంక ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని లేఖ రావడంతో ఆయన చల్లబడి ఈ వివాదానికి ముగింపు పలికారు. అయితే ఆ తరువాత కత్తి మహేష్ పవన్ అభిమానులతో కలిసి పార్టీలు కూడా చేసుకున్నట్లు ఆయన తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.

అయితే మళ్ళి గత కొద్దీ కాలంగా పవన్ పై సెటైర్ లు వేస్తున్న కత్తి మహేష్ అయన అభిమానులతో సోషల్ మీడియా లో తిట్లు తింటున్నారు. పవన్ వెళ్తున్న విధానాలు సరైనవి కావని ఒకవైపు శ్రీరెడ్డి పవన్ తల్లిని ఉద్దేశించి తప్పుడు వ్యాఖ్య చేసినందుకు పవన్ కు అలానే అఆయన తల్లికి క్షమాపణ చెప్పినప్పటికీ పవన్ వినడం లేదని అన్నారు. అలానే ఈ పూర్తి విషయానికి తానే కారణమని రాంగోపాల్ వర్మ ఒక వీడియో విడుదల చేసి ఆయన కూడా పవన్ కు ఆయన ఫాన్స్ కు మనస్పూర్తిగా క్షమాపణ చెప్పారని, కానీ పవన్ మాత్రం కావాలనే వారిపై వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తున్నారని అన్నారు.

అంతటితో ఆగకుండా పవన్ తన తల్లిని అడ్డంపెట్టుకుని రాజ్యకీయం చేయాలనుకోవడం సరైనది కాదని కత్తి అన్నారు. అయితే ఇలా పలువిధాలుగా పవన్ ను టార్గెట్ చేస్తున్న కత్తి మహేష్ ట్విట్టర్ అకౌంట్ ప్రస్తుతం మాయం అయినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటని ఆరా తీయగా పవన్ పై కత్తి చేస్తున్న ఆరోపణలకు పవన్ ఫాన్స్ చాలా మంది కత్తి ట్విట్టర్ ఖాతాను నిలిపివేయాలని రిపోర్ట్ లు మీద రిపోర్ట్ లు అదేపనిగా చేశారని. అదికూడా వేలాదిమంది చేసివుంటారని అందువల్లనే ఆయన ఖాతాను ట్విట్టర్ నిలిపివేయడం జరిగిందని తెలుస్తోంది. కాగా తన ఖాతాను నిలిపివేసినంత మాత్రం ఊరుకొని కత్తి వెనువెంటనే ఒక నూతన ట్విట్టర్ ఖాతాను తెరచి మళ్లి పవన్ పై తన మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments