పవన్, లోకేష్ లతో పార్టీ చేసిన కత్తి మహేష్ – నిజమేనా…?

Tuesday, November 12th, 2019, 01:40:26 AM IST

ప్రస్తుత కాలంలో వివాదాలకు చాలా మంది కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. కాగా ఇటీవల కాలంలో ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ తో వైరం పెట్టుకొని వివాదాల చరిత్ర పుటల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న వివాదాల రాజు కత్తి మహేష్. ఇకపోతే సంచలనాల దర్శకుడు ఆర్జీవీ తాజాగా తెరకెక్కించిన చిత్రం కమ్మ రాజ్యంలోకడప రెడ్లు.. కాగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ. అయితే ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో వివాదాలు అన్ని మామూలుగానే వర్మ చుట్టు ముట్టాయి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రంలో కత్తి మహేష్ సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో పవన్ మరియు నారాలోకేష్ పత్రాలు వేసినటువంటి డూప్ ఆర్టిస్టులతో కలిసి కత్తి మహేష్ పార్టీ చేసుకుంటున్నాడు. దానికి సంబందించిన ఒక ఫోటోను షేర్ చేసారు కత్తి మహేష్. ఇందులో పవన్ పాత్ర దారుడి చేతిలో బీర్ బాటిల్ ఉండగా, లోకేష్ పాత్రధారి పవన్ భుజంపై చేయి వేసుకుని ఉన్నాడు. కాగా ఈ చిత్రం నవంబర్ 29న సినిమా విడుదల కానుంది.