పవన్ కళ్యాణ్ వైరస్ లాంటివాడు అంటున్న కత్తి !!

Sunday, January 7th, 2018, 10:15:42 PM IST

మొత్తానికి కత్తి మహేష్ వ్యవహారం పెద్ద దుమారమే రేగుతుంది. రోజురోజుకు కత్తి మహేష్ చేస్తున్న వాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న కత్తి మహేష్ తాజాగా పవన్ కళ్యాణ్ వైరస్ లాంటి వాడంటూ అంటున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కత్తి మహేష్ విషయంలో సీరియస్ గా ఉన్నాడు. మహేష్ కత్తి కనిపిస్తే కొడతామని విజయవాడ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు చెప్పినట్టు తెలిసింది. అసలు కట్టి మహేష్ ఎందుకు పవన్ ని టార్గెట్ చేసాడనన్నది పక్కన పెడితే తాజాగా పవన్ కళ్యాణ్ ఓక అస్తిత్వం , నిలకడ లేని మనిషి, అసలు ఏ భావజాలంతో ఉన్నాడో అర్థం కానీ మనిషి .. కళ్ళలోకి చూస్తూ మాట్లాడలేని మనిషని, పదోతరగతి కూడా పాస్ కానీ ఒక వ్యక్తిని .. వీళ్ళందరూ దేవుడని ఆరడిస్తుంటే వాళ్లలో తీవ్రమైన సమస్య నెలకొంది. పవన్ కళ్యాణ్ అనే వైరస్ తో జాగ్రత్తగా ఉండాలి .. సమాజం నుండి తప్పించాలి, పవన్ కళ్యాణ్ ఫాన్స్ లో తమ పిల్లలు ఉంటె ఆ తల్లిదండ్రులు వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే పవన్ ఫాన్స్ నన్ను బెదిరిస్తూ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అన్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.