అసలు దీప్తికి ఓట్లు ఎవరు వేస్తున్నారో కూడా తెలీదంటున్న కౌశల్ ఆర్మీ.!

Tuesday, September 25th, 2018, 01:10:48 PM IST

ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి తెలీని ప్రేక్షకుడు ఎవరు ఉండి ఉండరు అంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే చెప్పవచ్చు,అసలు ఆ షో ఎందుకు పెట్టారో కూడా తెలీదన్న జనం కూడా లేకపోలేరు.ఆ షో బాగోదు అంటూ కూడా చూసే చాలా మంది జనం కూడా ఉన్నారు.బిగ్ బాస్ తెలుగులో కాస్త లేట్ గా మొదలయ్యినా సరే అద్భుత స్పందన వస్తుంది.ఈ రెండో సీజన్ కి అయితే మరీనూ,ఇప్పుడు ఈ సీజన్ చివరి దశకు చేరుకుంది.దీనితో ఒక్కొక్క కంటెస్టెంట్ యొక్క అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఈ సందర్భంలోనే కౌశల్ యొక్క అభిమానులు ఈ సారి టైటిల్ కౌశల్ సొంతం అని ధీమా వ్యక్తం చేస్తున్న ఈ సందర్భంలో ఎవ్వరు ఊహించని విధంగా దీప్తి కౌశల్ ఓట్ల సంఖ్యను దాటేసింది,దీనితో కౌశల్ అభిమానులు మండిపడుతున్నారు.అసలు ఎక్కడో కిందలో ఉండే దీప్తికి ఇంత హఠాత్తుగా ఇన్ని వేల ఓట్లు ఎలా వచ్చేస్తున్నాయని,ప్రశ్నిస్తున్నారు.దీప్తికి వస్తున్న ఓట్ల విషయంలో మాత్రం ఎదో తప్పు జరుగుతుందని,కావాలనే ఫేక్ ఓటింగ్ జరుగుతుంది అని మండిపడుతున్నారు.ఎవరు ఎన్ని ఫేక్ ఓట్లు వేసినా సరే ఈ సారి మాత్రం కౌశలే గెలుస్తాడని వారి అభిమానులు తెలుపుతున్నారు.