బిగ్ బాస్ తో “కౌశల్” బాగానే క్యాష్ చేసుకుంటున్నాడుగా..!

Thursday, October 11th, 2018, 08:55:31 AM IST

కౌశల్ పేరు బిగ్ బాస్ అనే ఒకే ఒక్క రియాలిటీ షో తో మారుమోగిపోయిందనే చెప్పాలి.బిగ్ బాస్ సీసన్ 1,బిగ్ బాస్ సీసన్ 2 ఈ రెండు షోలలో ఏ పోటీదారునికి దక్కని ప్రజాధరణ కౌశల్ కు దక్కింది అని చెప్పడంలో ఎలాంటి అతిశెయోక్తి లేదనే చెప్పాలి.బిగ్ బాస్ 2 టైటిల్, కోట్లల్లో ఓట్లు,మరియు లక్షల్లో అభిమానులను కౌశల్ ఈ ఒక్క షో తో సంపాదించుకున్నాడు.ఇప్పుడు కౌశల్ ప్రజల్లో మినీ స్టార్ అయ్యిపోయాడేమో అన్న సందేహం కూడా వచ్చినా కూడా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇప్పుడు ఇదే ఆదరణను కౌశల్ తన క్యాష్ గా మార్చుకుంటున్నాడు,అదే సందర్భంలో జనాల్లో కౌశల్ కు వస్తున్న అశేష స్పందన చూసి వస్త్ర షాపింగ్ కాంప్లెక్సుల వారు కూడా ఇదే అదనుగా భావించి వారి యొక్క షాపింగ్ మాల్స్ ను కౌశల్ చేత ప్రారంభిస్తున్నారు.ఇప్పుడు వస్తున్నది దసరా సీసన్ కావడంతో కౌశల్ పూర్తిగా బిజీ అయ్యిపోయాడు.తాజాగా కే ఎల్ ఎం ఫ్యాషన్ మాల్ వారు కౌశల్ తో భారీ గానే డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక మాల్ ను ప్రారంభించారు.ఇప్పుడు కూడా తాజాగా ఈ ఒక్కరోజే విశాఖపట్నం మరియు రాజమండ్రిలలో కూడా రెండు మాల్స్ ను ప్రారంభించనున్నారు.మళ్ళీ రేపు నెల్లూరులో లో ఒక మాల్ ప్రారంభినచనున్నారు.దీన్ని బట్టే మనం అర్ధం చేసుకోవచ్చు మార్కెట్ లో కౌశల్ రేంజ్ ఏ స్థాయిలో ఉందొ అని.

  •  
  •  
  •  
  •  

Comments