చాలా పెద్ద మార్జిన్ తో ముందంజలో ఉన్న కౌశల్..!

Saturday, September 29th, 2018, 05:09:32 PM IST

బిగ్ బాస్ 2 తెలుగు సీసన్ క్లైమాక్స్ దశకు చేరుకుంది.టైటిల్ విన్నర్ ఎవరు అన్న విషయం పై బుల్లి తెర ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.దాదాపు 100 రోజులు దాటి కొనసాగినటువంటి బిగ్ బాస్ షో ఈ ఆదివారంతో ముగియనుంది.దాదాపు 16 ,మంది ఇంటి సభ్యలతో మొదలయ్యిన రెండో సీసన్ ఇప్పడు ఐదుగురు ఇంటి సభ్యులతో ఫైనల్స్ కు చేరుకుంది,బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుస్తారా అని బిగ్ బాస్ షో అభిమానులు,హౌస్ మేట్స్ అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడున్న తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ 2 తెలుగు టైటిల్ మాత్రం కౌశల్ సొంతం అని చాలా గట్టిగా వినపడుతుంది.ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో ఉన్న క్రేజ్ ఏంటో ఇది వరకే కౌశల్ అభిమానులు కౌశల్ ఆర్మీ పేరిట నిరూపించారు.ఇప్పుడున్న ఐదుగురిలో కౌశల్ దాదాపు 75% మార్జిన్ తో మిగతా హౌస్ మేట్స్ తో పోల్చితే ముందంజలో ఉన్నాడని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి,అంతే కాకుండా ఇప్పటి వరకు నిర్వహించిన కొన్ని ప్రైవేట్ పోల్స్ లో కూడా కౌశల్ భారీ స్థాయి ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నాడు.దీనితో ఈ సారి టైటిల్ గెలిచే అవకాశాలు కౌశల్ కి ఉన్నంతగా వేరే ఎవ్వరికి లేవని చెప్పాల్సిందే.కౌశల్ అభిమానులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.