మాజీ ఎంపీ కవిత ఔదార్యం.. ఉన్నత విద్యనభ్యసించేందుకు యువకుడికి సాయం..!

Tuesday, June 2nd, 2020, 02:04:03 AM IST


ఉన్నత విద్యనభ్యసించేందుకు ఓ పేద విదార్థికి సాయం చేసి మాజీ ఎంపీ కవిత ఔదార్యం చాటుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన కూరాకుల మహేశ్ కష్టపడి చదివి రాంచీలోని ఐఐఎంలో సీటు సాధించారు.

అయితే కాలేజీలో సీటు ఖరారు చేసుకునేందుకు అడ్మిషన్ ఫీజుగా లక్ష చెల్లించాలి. కానీ మహేశ్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతో అంత డబ్బు సరిచేయడం వారికి కష్టంగా మారిపోయింది. ఓ పక్క ఫీజు చెల్లించాల్సిన గడువు దగ్గర పడుతుండడంతో ఏం చేయాలో అర్ధం కాక మహేశ్ తన చదువుకు సాయం చేయాలంటూ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను ట్విట్టర్ ద్వారా కోరారు. దీనికి స్పందించిన మాజీ ఎంపీ కవిత మహేష్ అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. స్వయంగా మహేశ్‌ను కలిసిన కవిత శుభాకాంక్షలు తెలిపి లక్ష చెక్కును అందజేశారు. అయితే అడిగిన వెంటనే స్పందించి, ఉన్నత ‌చదువులకు సహకరించినందుకు మహేష్ ‌కుటుంబ సభ్యులు కవితకు కృతజ్ఞతలు తెలిపారు.