తెలంగాణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

Sunday, September 14th, 2014, 06:30:24 PM IST


తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాలు కీలక పాత్ర పోషించారని, వారి సేవలు మరిచిపోలేనివని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు.ఈ రోజు ఆమె తెలంగాణ భవన్ లో టీచర్స్ యూనియన్ సభలో మాట్లాడారు. గ్రామస్థాయిలో ఉద్యమం పటిష్టంగా ఉన్నది అంటే అందుకు ఉపాధ్యాయులే కారణమని.. ఆమె అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో కూడా వారి సేవలు వినియోగించుకుంటామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. విద్యార్ధుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదని, దేశానికి ఉపయోగపడే పౌరులుగా విద్యార్ధులను మలచాలని ఆమె అన్నారు.