ఎన్నికల ప్రచారంలో జోరుమీదున్న కళ్యాణ్ రామ్ ?

Tuesday, November 7th, 2017, 11:22:20 AM IST

అదేంటి నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్నికలకోసం ప్రచారం చేయడం ఏమిటి ? ఇప్పుడు ఏ ఎన్నికలు జరుగుతున్నాయి ? అంటూ షాక్ అవ్వకండి. అయన ఎన్నికల ప్రచారం చేస్తున్నది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో ? తాజాగా నూతన దర్శకుడు ఉపేంద్ర మధ్వని దర్శకత్వంలో నటిస్తున్న ఎం ఎల్ ఏ సినిమాకోసం ఈ సన్నివేశం. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడట. వీరభద్రాపురం నుండి ఎం ఎల్ ఏ గా పోటీ చేస్తూ నల్లా గుర్తుకు ఓటేయమని ప్రచారం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఇందులో ప్రస్తుతం ఉన్న రాజకీయాల ప్రస్తావన లేకుండా తీస్తున్నారట. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. తొలిసారి పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments