దేశంలోనే నంబ‌ర్ -1 హోస్ట్ ఎవ‌రో తెలుసా?

Monday, October 23rd, 2017, 04:19:22 PM IST

దేశంలోనే నంబ‌ర్ -1 బుల్లితెర రియాలిటీ షో ఏది? దేశంలోనే నంబ‌ర్ -1 హోస్ట్ ఎవ‌రు? అంటే .. ఈ ప్ర‌శ్న‌ల‌కు ఏకైక స‌మాధానం కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి(కెబిసి) నంబ‌ర్ 1 షో. ఈ షోకి హోస్టింగ్ చేసిన బిగ్ బి అమితాబ్ ఆల్వేస్ నంబ‌ర్ -1 హోస్ట్‌. 75 ఏళ్ల వ‌య‌సులోనూ బిగ్‌బి రియాలిటీ షో హోస్ట్‌గా సాధిస్తున్న అసాధార‌ణ విజ‌యాలు ఆల్వేస్ హాట్ టాపిక్‌. ఇప్ప‌టికీ ఎదురేలేని హోస్ట్‌గా ఆయ‌న పేరు మార్మోగిపోతోంది. కెబిసి ఇప్ప‌టికే 9 సీజ‌న్లు పూర్తి చేసుకుంటే ఇందులో మెజారిటీ పార్ట్ హోస్టింగ్ బిగ్‌బిదే. అమితాబ్ ఈ షోని ర‌క్తి క‌ట్టించేలా నిలబెట్ట‌డంలో పెద్ద స‌క్సెస‌య్యారు. ఒక సాధార‌ణ క్విజ్ షోని ఆద్యంతం ర‌క్తి క‌ట్టేలా బుల్లితెర‌పై ఆవిష్క‌రించాలంటే అదో పెను స‌వాల్ అని అంటారాయ‌న‌. తాజాగా కెబిసి సీజ‌న్ 9 పూర్త‌యిన సంద‌ర్భంగా బిగ్‌బి త‌న బ్లాగులో త‌న అనుభ‌వం గురించి ముచ్చ‌టించారు. 2000లో బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా సోని చానెల్‌లో కెబిసి -1 ప్రారంభ‌మైంది. తొలి సీజ‌న్ బంప‌ర్ హిట్‌. ఆ స‌క్సెస్ లో మెజారిటీ షేర్ అమితాబ్‌కే ద‌క్కుతుంది. అప్ప‌టికే ఆర్థికంగా పీక‌ల్లోతులో మునిగి ఉన్న అమితాబ్‌ని ఆ షో అంతే గొప్ప‌గా ఆదుకుంది.

దాదాపు 450 మంది టీమ్ రేయింబ‌వ‌ళ్లు ఎంతో శ్ర‌మిస్తే ద‌క్కిన విజ‌య‌మిద‌ని బిగ్‌బి వాస్త‌విక‌త‌ను అంగీక‌రించారు. 17ఏళ్ల క్రితం మొద‌లైన ప‌య‌నం ఆద్యంతం విజ‌య‌వంత‌మైంది. నాటి నుంచి నేటివ‌ర‌కూ అదో స‌క్సెస్‌ఫుల్ జ‌ర్నీ. ఇదో హిస్ట‌రీ. ఈ జ‌ర్నీ ఆషామాషీ కాదు. సోని చానెల్‌ని ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ 1 స్థానంలో నిల‌ప‌డంలో కెబిసి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డింది“ అంటూ అమితాబ్ ఆనందం వ్య‌క్తం చేశారు. కేబిసి షో వ‌ల్ల అటు సోని చానెల్‌కే కాదు, ఇటు బిగ్‌బికి ఎంతో సాంత్వ‌న చేకూరిందనే చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments