తెలంగాణ ధనిక రాష్ట్రం…అభివృద్ది పనులకు డబ్బుల కొరతే లేదు!

Thursday, June 25th, 2020, 06:00:08 PM IST

ఆరవ విడత హరిత హారం ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని వ్యాఖ్యానించారు. అంతేకాక లాక్ డౌన్ కష్టకాలం లో రైతులకు రైతు బంధు డబ్బులు ఇచ్చాం అని అన్నారు. పచ్చదనం, పరిరక్షణా మన అందరి బాధ్యత అని వివరించారు. అంతేకాక గౌరవ ప్రదమైన ప్రజా ప్రతినిధులు పచ్చ దనాన్ని పెంచేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.అంతేకాక తెలంగాణ రాష్ట్రం లో ప్రతి గ్రామం లోనూ నర్సరీ ఉంది అని, అలా ఉన్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని వ్యాఖ్యానించారు. అంతేకాక తెలంగాణ ధనిక రాష్ట్రం అని, అభివృద్ది పనులకు డబ్బుల కొరతే లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణం గా లాక్ డౌన్ అమలు లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఉన్నపుడు ఉద్యోగులకు మూడు నెలల జీతం ఇవ్వలేదు అని, కానీ ఇపుడు పరిస్థితి బావుంది అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని, ఏపీ ఉండగా, తెలంగాణ కావాలి అంటే, పాలన రాదు అని అన్నారు అని వ్యాఖ్యానించారు. కానీ ఇపుడు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారింది అని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని స్వయంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది అని కేసీఆర్ అన్నారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ని సైతం వివరించే ప్రయత్నం చేశారు కేసీఆర్.