‘మేఘ’ కోసం కేసీఆర్ జగన్ భలే ప్లాన్ చేశారే

Tuesday, October 8th, 2019, 07:47:41 AM IST

తెలంగాణలో ప్రస్తుతం ఆర్టీసీ సంఘాలు చేస్తున్న సమ్మె తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎక్కడి బస్సులను అక్కడే డిపోలో ఉంచి, బయటకు రాకుండా చూస్తున్నారు, అదే సమయంలో నిరసనలు, నిరాహారదీక్షలు చేస్తున్నారు. మరో పక్క కేసీఆర్ మాత్రం దాదాపు విధుల్లో చేరని వాళ్ళందరూ ఉద్యోగాల నుండి వాళ్ళకి వాళ్లే తప్పుకున్నట్లు మాట్లాడుతున్నాడు. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారు, మేము తొలిగించేది ఏమి లేదంటూ చెపుతూ, ఆర్టీసీ ని ప్రవేటీకరణ చేసే దిశగా పావులు కదుపుతున్నాడు.

ఇందులో 50 % కార్పొరేషన్ బస్సులు,30% అద్దె బస్సులు, 20% ప్రవేట్ బస్సులను నడపాలని కేసీఆర్ నిర్ణహించుకున్నాడు. అయితే ఇక్కడ అద్దె బస్సుల స్థానంలో కొత్తవాటిని ప్రభుత్వమే తీసుకునే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అది కూడా ‘మేఘ’ కృష్ణరెడ్డికి చెందిన బస్సులను ఇందుకు ఉపయోగించాలని కెసిఆర్ చూస్తున్నాడు. మేఘ కృష్ణ రెడ్డి, చైనాకి చెందిన మరో సంస్థతో కలిసి బస్సులు తయారీ మొదలుపెట్టారు. ఆయనకి లబ్ది చేకూరే విధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నాడని తెలుస్తుంది.

అదే సమయంలో ఆంధ్రాలో కూడా తిరుమలకి దాదాపు 1000 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులను తిప్పాలని చూస్తున్నారు. అందులో భాగంగా మొదటి 400 బస్సులను కొనుగోలు చేయాలనీ తీర్మానించారు . అయితే ఈ బస్సులు కూడా మేఘ కృష్ణారెడ్డికి చెందిన సంస్థ నుండే కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనిని బట్టి చూస్తే అటు కేసీఆర్, ఇటు జగన్ ఇద్దరు కూడా “మేఘ కృష్ణారెడ్డి” మీద మంచి సానుభూతి చూపిస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఎంత మాత్రం తెలంగాణలో కాళేశ్వరం, ఆంధ్రాలో పోలవరం పనులు చేస్తున్నాడని కృష్ణారెడ్డి మీద ఇంత ప్రేమ చూపించటం అవసరమా..?