రవిప్రకాష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..ఇరు ముఖ్యమంత్రులు టార్గెట్

Tuesday, October 8th, 2019, 12:28:39 PM IST

tv9 మాజీ సీఈఓ రవిప్రకాష్ చుట్టూ గట్టి ఉచ్చు బిగుస్తుంది. ఇప్పటికే tv9 నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో రవిప్రకాష్ ని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైల్లో 14 రోజులు రిమాండ్ ఉంచారు. ఇప్పుడు తాజాగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి రవిప్రకాష్ మీద సంచలనమైన ఆరోపణలు చేశాడు. దేశ చట్టాలను అతిక్రమించి మనీ లాండరింగ్ చేశాడని. మీడియా,సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని చాలా మంది దగ్గర డబ్బులు వసూళ్లు చేసి, కెన్యా,ఉగాండా దేశాల్లో కేబుల్ టీవీలో పెట్టుబడులు పెట్టాడంటూ సాక్ష్యాధారాలతో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాస్తూ రవిప్రకాష్ కేసుని సిబిఐకి అప్పగించాలని కోరాడు.

ఒక్కసారిగా రవిప్రకాష్ విషయంలోకి విజయసాయి రెడ్డి రావటం కొందరికి ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు కానీ, ఇదేమంత పెద్ద షాకింగ్ విషయం అయితే కాదు. ఎందుకంటే తెలుగు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రవిప్రకాష్ ని టార్గెట్ చేశారనేది వాస్తవం, మైహోం రాజేశ్వరరావు, మేఘ కృష్ణారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కి బాగా దగ్గరి వ్యక్తులు. వాళ్ళని అడ్డం పెట్టుకొని రవిప్రకాష్ కి చుక్కలు చూపిస్తున్నాడు కేసీఆర్, అదే సమయంలో జగన్ కూడా విజయసాయి రెడ్డిని రంగంలోకి దించాడు. దీనితో రవిప్రకాష్ కి ఎటు పక్క నుండి ఊపిరాడటం లేదు. రీసెంట్ గా నిన్న రేవంత్ రెడ్డి వెళ్లి రవిప్రకాష్ ని కలిసి తన మద్దతు తెలిపివచ్చాడు. రవిప్రకాష్ కేసు విషయం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటుంది. ఎటు వైపు దారితీస్తుందో చూడాలి.