మైనార్టీల‌కు వ‌రాల జ‌ల్లు.. 160 గురుకులాలు!!

Saturday, September 17th, 2016, 01:25:45 PM IST

kcrr
మైనార్టీల‌కు మ‌రో శుభ‌వార్త‌. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి కొత్త‌గా 160 మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌లను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని టీ-ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు.

ఇప్ప‌టికే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల నుంచి మంచి రిజ‌ల్ట్ వ‌స్తోన్న నేప‌థ్యంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. విద్యా బోధ‌న కోసం అత్యుత్త‌మ శిక్ష‌ణ పొందిన సిబ్బందిని, బోధ‌నేత‌ర సిబ్బందిని నియ‌మిస్తామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే కేసీఆర్ 55 వేల మంది విద్యార్థుల‌కు మంచి విద్య‌, భోజ‌నం, వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించార‌ని అధికారులు తెలిపారు.

ఎస్టీ ఎస్టీ విద్యార్థుల త‌ర‌హాలోనే ఇక‌పై మైనార్టీ విధ్యార్ధుల‌కు మంచి విద్య అందించ‌డంలో భాగంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ‌లో కొత్త‌గా ఏర్పాట‌య్యే జిల్లాల్లో ఈ మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌లు నిర్మాణం కానున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది 71 గురుకుల పాఠ‌శాల‌ల‌ను ప్రారంభించామ‌ని కేసీర్ మ‌రోసారి గుర్తు చేశారు. తాజా డెసిష‌న్‌తో తెలంగాణ వ్యాప్తంగా 231 గురుకులాలు ఏర్పాట‌వుతున్న‌ట్టు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మైనార్టీల ఓట్ల‌న్నీ గంప‌గుత్త‌గా త‌మ పార్టీకే అన్న‌మాట‌!!