ఆర్టీసీ సమ్మె: కేసీఆర్ దెబ్బకి విలవిల్లాడుతున్న ప్రతిపక్షాలు!

Monday, October 21st, 2019, 10:16:40 AM IST

ఆర్టీసీ సమ్మె 17 వ రోజుకి చేరుకుంది. కేసీఆర్ తీరు పాట తీవ్ర అసంతృప్తిగా వున్న ఆర్టీసీ కార్మికులు, ప్రతి పక్షాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, ప్రగతి భవన్ ని ముట్టడించేందుకు ప్లాన్ చేసారు. కాంగ్రెస్ నేతలు నిన్న జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రగతి భవన్ ముట్టదించాల్సిందిగా నేతలను, కార్యకర్తలను కోరడం జరిగింది. పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేసారు. ఉదయం అయిదు గంటల సమయం నుండే పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

ప్రగతి భవన్ ముట్టడి కి సిద్దమైన కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా, పలువురు నాయకులూ పోలీస్ స్టేషన్ల ఎదుట ఆందోళన వ్యక్తం చేయగా అరెస్ట్ చేసినట్లు సమాచారం. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ముట్టడికి యత్నం చేస్తారని ప్రగతి భవన్ వద్ద పోలీసులని భారీగా మోహరించారు. సికింద్రాబాద్ రూట్ లో రాకపోకలకు ప్రయాణికులకు ఇబ్బందిగా ఉన్నట్లు తెలుస్తుంది. వాహనాలను తనికీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. తద్వారా సికింద్రాబాద్ రూట్ లో భారీ ట్రాఫిక్ జాం అయినట్లు తెలుస్తుంది.