ఆయన నా క్లోజ్ ఫ్రెండ్ : కేసీఆర్

Friday, April 13th, 2018, 04:39:11 PM IST

గత కొంత కాలంగా దేశ రాజకీయాలపై తనదైన శైలిలో ప్రశ్నలను సంధిస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ కి రోజు రోజుకి అభిమానులు ఎక్కువవుతున్నారు. చాలా మంది ప్రముఖులు కూడా ఆయన గురించి పాజిటివ్ గా కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడారు. రీసెంట్ గా బెంగళూరులో మాజీ ప్రధాని దేవేగౌడని కేసీఆర్ ప్రత్యేకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ప్రకాష్ రాజ్ గురించి పాజిటివ్ గా స్పందించారు. ఆయన తనకు క్లోజ్ ఫ్రెండ్ అని చెబుతూ సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అని కొనియాడారు. అంతే కాకుండా అణగారిన వర్గాల కోసం పాటుపడుతున్న రియల్ హీరో అన్నారు. కర్ణాటకకు చెందిన వ్యక్తి అయినప్పటికీ అన్ని వర్గాల గురించి పోరాడే వ్యక్తి అందుకే ఆయనను అభినందిస్తున్నట్లు కేసీఆర్ వివరించారు.