తెలంగాణ అంబాసిడర్ కు అభినందనలు

Saturday, September 6th, 2014, 10:34:06 AM IST


తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జాకు ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనలు తెలియజేశారు. యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచినందుకు సంతోషంగా ఉన్నదని ముఖ్యమంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. సానియా దేశానికే గర్వకారణమని ఆయన తెలిపారు.

సానియా మీర్జాకు ఇది మూడో కెరీర్ టైటిల్. ఇండో-బ్రెజిలియన్ టాప్ సీడ్ సానియా-బ్రూనో జంట యూఎస్ ఏ మెక్సికో జంటను ఫైనల్ లో ఓడించి టైటిల్ గెలుపొందారు. తరువాత జరగబోయే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో కూడా తాము కలిసి అడబోతున్నట్టు టైటిల్ గెలిచిన అనంతరం సానియా వెల్లడించింది.