నా కల దేవుడు నెరవేరుస్తాడు: కేసీఆర్

Monday, October 9th, 2017, 08:38:26 AM IST

తెలంగాణాలో టీఆరెస్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్రతి పక్షాలు ఎన్ని సవాళ్లు విసిరినా కూడా ఏ మాత్రం తడబడకుండా తన టాలెంట్ ను చూపిస్తోంది. అంతే కాకుండా విజయం పొందిన ప్రతి సారి దానికి ఓ గుర్తింపు తెచ్చేలా నాయకులు అడుగులు వేస్తున్నారు. గురువారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.

అయితే ఈ సభలో కేసీఆర్ కొన్ని విషయాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం మీరు కొట్లాడితేనే నేను బతికా. లంచాలు పోవాలంటే ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలి. కేసీఆర్‌ సింగరేణి ప్రాంతానికి వచ్చిపోయాక లంచాలు బంద్‌ కావాలి. అందుకు ఒక వ్యవస్థను తెచ్చేలా చేస్తా. సింగరేణిని మరింత ముందుకు తీసుకుపోదాం అంటూ అందరికి తెలియజేశారు. అంతే కాకుండా కేసీఆర్ తన మనసులో ఒక కళ ఉందని ఇప్పటివరకు దేవుడు అన్ని నెరవేర్చాడు. అదికూడా నెరవేరుస్తాడని నమ్మకం తనకు ఉందని కేసీఆర్ తెలిపారు. సింగరేణి వ్యవస్థలో కార్మికుల ఉన్నారు కానీ వాటిని వెలికి తీయడంలో నిపుణులు లేరని త్వరలోనే ఆ విషయంపై సరైన నిర్ణయం తీసుకుంటామని చెబుతూ.. సింగరేణిలో మార్పులు జరగకపోతే తెలంగాణ వచ్చి కూడా లాభం ఉండదని చెప్పారు.