2.93 కోట్ల ఎక‌రాల భూరికార్డుల ప్ర‌క్షాళ‌న‌

Thursday, May 17th, 2018, 03:18:12 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌నిత‌నాన్ని ఓ విష‌యంలో ప్ర‌త్యేకించి ప్ర‌శంసించాల్సిందే. అటు ఏపీలో చంద్ర‌బాబు నాయుడు ఇలాకాలో భూద‌స్త్రాల విష‌యంలో లేని క్లారిటీ, ఇటు తెలంగాణ ఇలాకాలో ఉంద‌నడానికి ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ఇచ్చిన వివ‌ర‌ణే ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. తెలంగాణ వ్యాప్తంగా ప‌ల్లె, ప‌ట్నం అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఓ య‌జ్ఞంలా భూద‌స్త్రాల్ని, రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రికార్డుల్ని ప్ర‌క్షాళ‌న చేసింది కేసీఆర్ ప్ర‌భుత్వం.
2.93కోట్ల‌ ఎక‌రాల భూ రికార్డుల్ని ప‌రిశీలించి, 2.36కోట్ల ఎక‌రాల భూమికి సంబంధించిన ద‌స్త్రాల్ని ప్ర‌క్షాళ‌న చేశారు. ఆ సంగ‌తిని సీఎం కేసీఆర్ స్వ‌యంగా వెల్ల‌డించారు. దాదాపు 95 శాతం మేర భూరికార్డులపై ఎలాంటి లిటిగేష‌న్ లేకుండా ప్ర‌క్షాళ‌న చేయ‌గ‌లిగామ‌ని కేసీఆర్ తెలిపారు. మిగిలిన ఐదు శాతం మెజారిటీ పార్ట్ అడ‌వుల‌కు సంబంధించిన‌వి అని, వాటిలో కొన్ని లిటిగేష‌న్లు ఉన్నాయ‌ని సీఎం వెల్ల‌డించారు.

తెలంగాణ రాష్ట్రం ఆదాయ పురోగ‌తిలో నంబ‌ర్ -1 స్థానంలో ఉంద‌ని కేంద్రం వ‌ద్ద‌ రిపోర్టులు ఉన్నాయ‌ని తెలిపారు. అలానే త‌మ‌కు వ‌చ్చే నిధుల్లో క్యాపిటల్‌ని ఖ‌ర్చు చేయ‌డంలోనూ వంద శాతం స‌క్సెస్ రేటు ఉంద‌ని అన్నారు. కేసీఆర్ ఓవైపు ఇలా భూదస్త్రాల విష‌యంలో ఎంతో శ్ర‌ద్ధ‌ను క‌న‌బ‌రుస్తుంటే, అటువైపు ఏపీలో లిటిగేష‌న్ భూముల‌కు సంబంధించిన ఎక్క‌డా దర్యాప్తు స‌రిగా సాగ‌లేదు. బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో సిట్ ద‌ర్యాప్తు పేరుతో సాగించిన విచార‌ణ తుంగ‌లో క‌లిసిపోయింది. అక్క‌డ మంత్రులు- ఎమ్మెల్యేలు అధికారుల‌తో క‌లిసి సాగించిన భూదందాకు ప్ర‌భుత్వ‌మే వ‌త్తాసు ప‌లికి, ఆ విచార‌ణ‌ను నీరు గార్చింద‌ని ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

Comments