మోడీతో ఫ్రెండ్లీగానే ఉండాలనుకుంటున్న కేసీఆర్, జగన్

Thursday, June 13th, 2019, 07:56:51 PM IST

ఊహించని రీతిలో 300లకి పైగా స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండోసారి ప్రధాన అయిన మోడీ పట్ల సఖ్యతతో ఉండాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ భావిస్తున్నారు. గతంలో కూడా కేసీఆర్ కేంద్రంతో తటస్థంగానే ఉన్న కేసీఆర్ కొన్ని అంశాల్లో మాత్రమే కేంద్రంతో విభేదించినా మెజారిటీ అంశాల్లో మద్దతు తెలిపారు. కీలకమైన నోట్ల రద్దు జీఎస్టీ అంశాల్లో మోడీ నిర్ణయాన్ని స్వాగతించారు. పైగా థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాల్ని కూడా నిదానంగానే నడుపుకున్నారు.

ఇక మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ సైతం మోడీతో స్నేహంగానే మెలగాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సంగతి పలు సందర్భాల్లో బయటపడింది కూడా. గత ముఖ్యమంత్రి చంద్రబాబులా పదవీకాలం ముగిసే చివర్లో వైరం పెట్టుకుని ప్రయోజనాలు పొందకుండా పోవడం కంటే మొదటి నుంచి స్నేహంగా మెలిగి ప్రయోజనాలు రాబట్టుకోవాలని భావిస్తున్నారు. మొన్న తిరుపతి సభలో మోడీకి అమితమైన గౌరవం ఇచ్చి కేంద్రంతో సున్నం పెట్టుకునే అవసరం లేదని బాహాటంగానే చూపించారు. మరి ఒదిగివుంటే ఆదరించే తత్వమున్న మోడీ తెలుగు ముఖ్యమంత్రులకు ఏమేరకు సహకరిస్తారో చూడాలి.