స్పెష‌ల్‌: కొత్త‌సంవ‌త్స‌రంలో ఇలా జ‌రిగితే!! వావ్ అన‌రూ?

Friday, December 30th, 2016, 10:03:16 AM IST

kcr-jana
చంద్ర‌బాబు వెళ్లి వైయ‌స్ జ‌గ‌న్ ఇంట్లో భోజ‌నం చేస్తే, సేమ్ టు సేమ్ జ‌గ‌న్ వెళ్లి బాబు ఇంట్లో, కేసీఆర్ వెళ్లి రేవంత్ ఇంట్లో పులుసు వేసుకుని అన్నం తింటే.. అబ్బో విన‌డానికే విందుభోజ‌నం తిన్నంత ప‌సందుగా లేదూ?

కేసీఆర్ వెళ్లి రేవంత్ రెడ్డి ఇంట్లో భోంచేస్తే, రేవంత్ వ‌చ్చి కేసీఆర్ గ‌డ‌ప తొక్కి ఆ ఇంట విందుభోజనం లాగిస్తే .. ఆహా అది చూపరుల‌కు ఎలా ఉంటుంది? ఏమో ఎలా ఉంటుందో కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌తిపాద‌న అలానే ఉంది మ‌రి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ల ఇళ్ల‌కు సీఎంలు వెళ్లి భోజ‌నాలు చేసే సాంప్ర‌దాయం ఉంది. దానిని కొన‌సాగిస్తాన‌ని అన్నారు. త‌న‌కు ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న జానా రెడ్డి ఇంటికెళ్లి పులుస‌న్నం తింటాన‌న్నారు. అయితే కేసీఆర్ అదే తీరుగా రేవంత్ ఇంటికి కూడా వెళ్లి రాగ‌ల‌రా? విందార‌గించ‌గ‌ల‌రా? అంటూ సెటైర్లు ప‌డుతున్నాయ్‌. దాంతో పాటే జ‌గ‌న్‌, బాబు ప్ర‌స్థావ‌న‌ను తెస్తున్నారు ఏపీ పొలిటిక‌ల్ కారిడార్‌లో. కొత్త సంవ‌త్స‌రం వేళ ఇలాంటి వింత‌లేవైనా జ‌రిగితే ఎంత బావుణ్ణు!! ప్చ్‌..ఇవ‌న్నీ సాధ్య‌మేనంటారా?

  •  
  •  
  •  
  •  

Comments