కెసిఆర్ కొత్త ప్లాన్ – బీజేపీ కి చుక్కలేనా…?

Wednesday, September 18th, 2019, 08:51:59 PM IST

గత ఏడాది తెలంగాణాలో జరిగినటువంటి ఎన్నికల్లో తెరాస పార్టీ సృష్టించిన ప్రభంజనం అంత ఇంతా కాదు. తెరాస పార్టీ దెబ్బకి మిగతా పార్టీలన్నీ కూడా దారుణమైన ఓటమిని కూడగట్టుకున్నాయి. కానీ తెలంగాణాలో ఆ తరువాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెరాస పార్టీ పెద్దగా రాణించలేదని చెప్పాలి. ఆ సార్వత్రిక ఎన్నికల్లో తెరాస పార్టీ కొన్ని ముఖ్యమైన స్థానాల్లోనే ఓటమి పాలయిందని చెప్పాలి. అయితే దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వరుసగా రెండవసారి అధికారాన్ని దక్కించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే అదే ఊపులో రెండు తెలుగురాష్ట్రాల్లో కూడా బలపడాలనే ఉద్దేశంతో కొత్త ప్రణాళికలకు ప్రాణం పోస్తుంది బీజేపీ.

ఈమేరకు తెలంగాణాలో అధికారంలో ఉన్నటువంటి తెరాస పార్టీ పై తన అంతర్గత యుద్దాన్ని చూస్తుంది బీజేపీ. కాగా తెలనగానలో తెరాస పార్టీ తరపున అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలను తన పార్టీలోకి లాక్కోడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. కాగా తెలంగాణ లో బలపడాలని చూస్తున్నటువంటి బీజేపీ కి సరైన పెద్ద దెబ్బకొట్టేందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధమయ్యారు. అయితే త్వరలో మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ ని దెబ్బకొట్టాలని తెరాస అధిష్టానం ప్లాన్. అయితే మహారాష్ట్రలో బీజేపీ కి గోరమైన పటు ఉందన్న సంగతి మనకు తెలుసు. ఎలాగైనా బీజేపీ కి గట్టి దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నటువంటి కెసిఆర్ ఆశలు ఫలిస్తాయా, కెసిఆర్ వేసే ప్లాన్ కి బీజేపీ తట్టుకుంటుందా అని పలువురు రాజకీయా విశ్లేషకులు చర్చించుకుంటున్నారని సమాచారం.