స్టూడియో స్థలాలకోసం కేసీఆర్ కొత్త డ్రామా ?

Saturday, July 7th, 2018, 03:08:30 AM IST

మద్రాసులో ఉన్న తెలుగు పరిశ్రమ హైద్రాబాద్ తరలిరావడానికి చాలా కాలమే పట్టింది. అప్పటి ప్రభుత్వాలు తెలుగు సినిమాను హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన నిర్మాతలకు స్టూడియో నిర్మాణాలకు స్థలం ఇచ్చి అభివృద్ధికి సహకరించింది. అప్పటి ప్రభుత్వం సహకారంతో ప్రముఖ నిర్మాత రామానాయుడు, అక్కినేని ఇద్దరు స్టూడియోస్ నిర్మించడంతో సినిమా పరిశ్రమ మొత్తం హైద్రాబాద్ రావడం మొదలు పెట్టి .. ప్రస్తుతం ఇక్కడ సెటిల్ అయింది. తాజాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనతో ఇప్పుడు పలువురు ప్రముఖుల డైలమాలో ఉన్నారు .. ఇక్కడే ఉండాలా లేదా విజయవాడ .. వైజాగ్ తరలిపోవాలా అని .. ఎందుకంటే సినిమా రంగంలో 80 శతం మంది ఆంధ్రా ప్రాంతానికి చెందినవాళ్లు కావడంతో తమ సొంత ప్రాంతంలో స్టూడియోస్ నిర్మించుకుని సినిమా పరిశ్రమను అక్కడికి తరలించేస్తే బాగుంటుందన్న ప్రయత్నాలు జరిగాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి హైద్రాబాద్ శివార్లలో రెండువేల ఎకరాలతో పెద్ద సినిమా స్టూడియోని ప్రభుత్వం నిర్మిస్తుందని, ఇక్కడ సినిమాలు తీసే వారికీ ఏంతో సపోర్ట్ అందిస్తామని .. రకరకాల వాగ్దానాలు జరిగాయి .. కానీ యాజ్ యూజువల్ గా చెప్పినవేవి జరగలేదు. తాజాగా ఉన్న స్టూడియో స్థలాలను ప్రభుత్వానికి ఇవ్వాలని దాని స్థానంలో హైద్రాబాద్ శివార్లలో సకల సదుపాయాలతో కొత్త స్టూడియో నిర్మించి ఇస్తామని .. ఆ స్థలాలను ప్రభుత్వ అవసరాలతో పాటు కమర్షియల్ అవసరాలకు వాడతామని సినిమా పెద్దలకు ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది. ఈ ప్రపోజల్ పై పలువురు నిర్మాతలు నో చెప్పారట .. ఇక ఓ ప్రముఖ నిర్మాత అయితే అది తన తండ్రి జ్ఞాపకార్థం నిర్మించాడని, తెలుగు సినిమా హైద్రాబాద్ రావడానికి ఎంతో కృషి చేసాడని అలంటి స్టూడియోని ఇవ్వనని చెప్పాడట. ఇప్పటికే కొన్ని స్థలాల విషయంలో టీఆరెస్ పై ఆరోపణలు వస్తున్నాయి .. అలాంటి సమయంలో కేసీఆర్ ఇలా సినీ స్టూడియో స్థలాలపై కన్నేయడం పై పలు వివాదాలు వ్యక్తం అవుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments