గురుపూజోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి

Friday, September 5th, 2014, 11:56:13 AM IST


గురుపుజోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఉదయం ఆయన ట్యాంక్ బండ్ మీదున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉపాద్యాయులను కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి అన్నారు. డాక్టర్ సర్వేపల్లి స్పూర్తితో సమాజహితం కోసం ఉపాద్యాయులుపనిచేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుపుజోత్సవ వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు.