కెసిఆర్ మానస పుత్రిక విదేశీ భవన్

Sunday, January 29th, 2017, 12:50:19 PM IST

kcr
దేశం లో వేరే ఏ ముఖ్యమంత్రికీ లేని స్టైల్ కెసిఆర్ కి ఉంది. ఎదుటి వ్యక్తులు ఎవరైనా సరే సూచలు సలహాలు ఇవ్వడం ఆయనకీ పరిపాటి. పెద్ద నోట్ల రద్దు టైం లో సైతం స్ట్రెయిట్ గా మోడీ ని కలిసి ఎలా డీల్ చెయ్యాలి అనేది సలహా ఇచ్చారు కెసిఆర్ అంటారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసే విదేశీ భవన్ తో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వెళ్లే వారికి ఉపయోగపడుతుందన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. ప్రపంచంలో ఎక్కడ.. ఏ భారతీయుడికి ఇబ్బంది కలిగినా.. వెంటనే స్పందించి వారికి సహకారం అందించే రీతిలో వ్యవస్థను సిద్దంచేయాలన్న మాటను చెప్పారు. విదేశీ వ్యవహారాల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి కేంద్ర విదేశాంగ కార్యదర్శికి కేసీఆర్ కొన్ని సూచనలు అందించినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసే విదేశీ భవన్ విషయంలో కేంద్రంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా ప్రకటించిన విదేశీ భవన్.. గత భవన్ ల మాదిరి మాటల్లోనే ఉండిపోతుందా? కార్యరూపం దాలుస్తుందా? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.