షాకింగ్ : జగన్ విషయంలో కెసిఆర్ పెద్ద ప్లానే వేసారుగా.!?

Tuesday, August 13th, 2019, 09:44:49 AM IST

ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్యన సత్సంబంధాలతో ఒకరికి ఒకరి చేదోడువాదోడుగా నిలబడుతున్న సంగతి తెలిసిందే.ఒకప్పుడు అంటే ఉత్తర ధృవం దక్షిణ ధృవంలా ఉండే వారు కానీ ఇప్పుడైతే కలిసే ఉంటున్నారు.ముఖ్యంగా అయితే ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనే తెలంగాణలోని ముందస్తు సమయంలో తెలుగుదేశం పార్టీకు గట్టి బుద్ధి చెప్పడానికే కెసిఆర్ జగన్ను ఎంచుకున్నారని మరో వార్త కూడా గట్టిగానే వినిపించింది.

కానీ కెసిఆర్ జగన్ తో ఇప్పుడు కలిసి మెలసి ఉంటున్నందుకు మరో పెద్ద కారణమే ఉందని ఒక వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది.తాజాగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి నీళ్లు తమిళనాడుకు జగన్ వదిలిన సంగతి తెలిసిందే.ఇలా చెయ్యమని చెప్పింది కూడా కెసిఆరే అని ఎందుకంటే రాబోయే నాలుగేళ్లలో కేంద్రంపై తిరుగుబాటు చెయ్యక తప్పదని అలంటి సమయంలో వారికి ఖచ్చితంగా జగన్ తో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్దతు కావాలని అందుకే ఇలా చేసారని కెసిఆర్ తన స్వలాభం కోసం జగన్ తో సంబంధం ఏర్పర్చుకున్నారని సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.