ఇంకా ఆట ఆరంభంకాలేదు.!

Tuesday, September 16th, 2014, 04:58:30 PM IST


తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన ఇంకా మొదలవ్వలేదని..తెరాస పార్టీ తానూ అనుకున్న లక్ష్యాలను తప్పకుండా చేరుకుంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఈరోజు ఆయన మెదక్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస మార్క్ పాలన ఇంకా ప్రారంభం కాలేదని.. తెరాస పాలన మొదలైతే.. ఆ పార్టీ ముందు ఏ పార్టీ నిలబడలేదని కెసిఆర్ అన్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన బీజేపి మూడో స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఉప ఎన్నికలలో మెదక్ పార్లమెంట్ స్థానానికి వచినంత మెజారిటీ.. మిగతా రెండు పార్లమెంట్ స్థానాలకి రాలేదని.. ఆయన అన్నారు. వడోదర కంటే మెదక్ లోనే భారీ మెజారిటీతో తెరాస అభ్యర్ధి గెలుపొందారని ఆయన అన్నారు. దసరా నుంచి బంగారు తెలంగాణ ఫలాలు అందుతాయని కెసిఆర్ ఈ సందర్భంగా తెలిపారు.