బీజేపీకి కేసీఆర్ మార్క్ పంచ్..! గిట్లాంటోళ్ల ముచ్చట దండగ

Friday, July 12th, 2019, 11:28:36 AM IST

తెలంగాణలో బీజేపీ 2023 కి ప్రధాన పార్టీగా అవతరించాలని గట్టిగానే ట్రై చేస్తుంది. అందుకోసరం ఇతర పార్టీ నేతలను చేర్చుకోవాలని చూస్తుంది. అందులో భాగంగా మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. అయితే బీజేపీ చేసే అలాంటి పనులకి ఎవరు భయపడవద్దని, బీజేపీ మాయ మాటలకి ఎవరు లొంగవద్దని కేసీఆర్ తనదైన రీతిలో చెప్పుకొచ్చాడు. ‘‘బీజేపోడు గిట్లనే.. ఆరు నెలలు అరిచి, అరిచి అలిసిపోతడు’’ గాళ్లనీ చూసి మనం ఎందుకు గాబరా పడాలి. ఇంకా ఎన్నికలకి నాలుగున్నరేళ్ల సమయం ఉంది. ఇప్పుడు ఎంత అరచి గీపెట్టుకున్న చేసేది ఏమి లేదు.

ఎదో నాలుగు సీట్లు వస్తే దానిని చూసి వాళ్ల్లు ఎగిరెగిరి పడుతున్నారు. ఎవరు బిత్తర కావాల్సిన పని లేదు. బీజేపీకి సరైన యంత్రంగం లేదు, సరైన క్యాడర్ లేదు. ఆ పార్టీ పరిషత్‌ ఎన్నికల్లో ఎనిమిది జడ్పీటీసీ స్థానాలకు పరిమితమే అయ్యింది. కాబట్టి వాళ్ళని పట్టించుకోవలసిన అవసరమే లేదు. మన పని మనం గట్టిగా చేద్దాం..ప్రజలకి సరైన సేవ చేద్దాం వాళ్లే గెలిపిస్తారు. మనకి బోలెడు పనులు ఉన్నాయి వాటిని చూద్దామంటూ, బీజేపీ గురించి వాళ్ళు చేస్తున్న విమర్శలు గురించి చాలా సాదాసీదాగా తేల్చిపారేశాడు కేసీఆర్.

నిజానికి బీజేపీ చేస్తున్న విమర్శల గురించి కేసీఆర్ పబ్లిక్ లో విరుచుకుపడుతాడని, వాటికి కౌంటర్ గా బీజేపీ మాట్లాడి, దాని ద్వారా ఫోకస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ని ఇరుగున పెట్టే విమర్శలు చేశారు. అయితే ఇలాంటివి ముందే పసిగట్టిన కేసీఆర్ వాళ్ళకి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా, వాళ్లపై పబ్లిక్ లో ఎలాంటి కామెంట్స్ చేయకుండా కేవలం ప్రవైట్ మీటింగ్ లోనే ఒక్క ముక్క మాట్లాడి, బీజేపీని తేల్చి పక్కన పెట్టేశాడు. అయిన ఇలాంటి రాజకీయాలన్నీ ముక్కుతో వాసన పట్టి ఆపోసన పట్టిన కేసీఆర్ ని ముగ్గులోకి లాగాలంటే తెలంగాణ బీజేపీ నేతల వలన అయ్యేపనే కాదు.