అభ్యర్థులను ఫైనల్ చేసేది కేసీఆరే

Thursday, July 11th, 2019, 03:07:30 PM IST

పార్లమెంట్ ఎన్నికల్లో భాజాపా ఇచ్చిన షాక్ కారణంగా భాజాపాలో అప్రమత్తత బాగా పెరిగింది. ముఖ్యంగా కేసీఆర్ కేంద్రంలో భాజాపా అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో త్వరగా పుంజుకునే ప్రమాదం ఉందని గ్రహించి ఇకపై వారికి ఎలాంటి ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ వారికి ఆస్కారం ఇవ్వకూదనే అనుకుంటున్నారు.

అందుకే త్వరలో రానున్న పురపాలక ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించాలని పట్టుబట్టింది. అభ్యర్థుల ఎంపికను స్వయంగా కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారంటే పరిస్తితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందుగా కేటిఆర్ నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ప్రచారం నిర్వహిస్తారు. 15న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కీలక నేతల ద్వారా అభ్యర్థుల జాబితా తయారుచేయించి కేసీఆర్ వద్దకు పంపుతారు.

కేసీఆర్ ఒక్కొక్కరి నేపథ్యాన్ని పరిశీలించి మరీ తుది జాబితాను రూపొందిస్తారట. ఈ ఎన్నికలతో పార్టీ సంస్థాగతంగా ఎంత బలంగా ఉందో చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు.