మోడీతో ముగిసిన భేటీ

Saturday, September 6th, 2014, 12:36:27 PM IST


ప్రధాని నరేంద్ర మోడీ తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న 21 సమస్యల గురించి ప్రధానితో చర్చించారు. తెలంగాణకు ప్రత్యేక హొదా కల్పించాలని ఆయన మోడిని కోరారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హొదా కల్పించాలని, అలాగే ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సహకరించాలని ప్రధానిని కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్నదని, నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ను రాష్ట్రానికి అందించాలని మోడికి విన్నవించారు. ఆరువేల కోట్ల రూపాయల నిధుల్ని తెలంగాణకు మంజూరు చేయాలని మోడీని కోరారు. అక్టోబర్ 7 నుంచి 10వ తేది వరకు జరిగే ప్రపంచ మేయర్ల సదస్సుకు ప్రధానిని ఆహ్వానించారు. ప్రధాని సమస్యలపై సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.