నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్న కెసిఆర్ – మళ్ళీ సబితకు హోంశాఖ ఖాయమేనా…?

Saturday, August 24th, 2019, 02:44:53 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఇక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి కెసిఆర్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాడు. కాగా ఈ పదవులను ఎవరెవరికి ఇవ్వాలని కెసిఆర్ తో పటు కొందరితో సమాలోచనలు జరుపుతున్నారని సమాచారం. అయితే ఈ పదవులు తమకి వస్తాయో లేదో అని కొందరు నేతలు భయపడుతున్నారని సమాచారం. అంతేకాకుండా ఇటీవల తెరాస లో చేరిన వారికే ఈ నామినేటెడ్ పదవులు దక్కుతాయని తెరాస వర్గాల్లో పెద్ద చర్చ మొదలైందని చెప్పాలి… అయితే తెరాస లో ముందు నుండి ఉన్నవారికే ఈ నామినేటెడ్ పదవులు ఇస్తానని కెసిఆర్ గతంలో హామీ ఇచ్చారు కానీ కొన్ని రాజకీయ సమీకరణాల వలన అది ప్రస్తుతానికి వీలు పడటం లేదని అందరు కూడా చెప్పుకుంటున్నారు…

ఈలెక్క ప్రకారం చూసుకుంటే తెలంగాణాలో జరిగినటువంటి ఎన్నికల్లో, స్థానిక ఎన్నకల్లో కూడా అపుడే తెరాస లో చేరిన వారికే టిక్కెట్లు కేటాయించడం గమనార్హం అయితే ఇపుడు కొత్తగా చేరిన వారికి ఇచ్చినటువంటి మాట కారణంగా ముందు నుండే తెరాస లో ఉన్నవారికి వెన్నుపోటు తప్పడం లేదని అందరు కూడా అనుకుంటున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు సబితా ఇంద్రారెడ్డి కి ఆనాడే కేబినెట్ హోదా కల్పిస్తానని కెసిఆర్ మాటిచ్చారు. అంటే సబితకు ఇప్పుడు హోంశాఖ అప్పగించనున్నారని విశ్వసనీవర్గాల సమాచారం. కానీ ఎవరికీ ఎలాంటి పదవి వస్తుందో తెలుసుకోవాలంటే కొద్దీ రోజుల నిరీక్షణ తప్పేలాలేదు…