బిగ్ న్యూస్ : జిహెచ్ఎంసి విషయంలో కెసిఆర్ సంచలన నిర్ణయం.?

Sunday, June 28th, 2020, 05:59:15 PM IST

ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రమాద కారి కరోనా వైరస్ ప్రభావం ఏ స్థాయిలో ప్రతాపం చూపుతుందో అందరికీ తెలిసిందే. అయితే కరోనా డ్రామాలో మాత్రం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి. మొదట్లో కరొనను హేళన చేసి మాట్లాడిన వారు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తును నవ్వులు పాలు చేసుకున్నారు.

ఈ వరుసలో అయితే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుంటారని చెప్పాలి.దేశమంతా లాక్ డౌన్ ఉన్న సమయంలో కెసిఆర్ ప్రెస్ మీట్ పెట్టి చేసిన హడావుడి చూసి ప్రతీ ఒక్కరు ఓ రేంజ్ లో పొగడ్తల్లో ముంచేవారు. కానీ ఇప్పుడు అలా పొగిడిన వారే కెసిఆర్ ఒట్టి మాటల సీఎం మాత్రమే అని ఎక్కి పారేస్తున్నారు. కరోనా విషయంలో కెసిఆర్ వైఫల్యం ఇప్పుడు చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది.

ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధి విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. దీనితో ఆ పరిధి విషయంలో కెసిఆర్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తుంది. సంబంధిత అధికారులతో సమావేశం అయ్యి కెసిఆర్ మూడు నాలుగు రోజుల్లో వ్యూహం ఏమిటి అన్నది తెలియజేయాలని తెలిపారు.

దాని ప్రకారం జిహెచ్ఎంసి పరిధిలో లాక్ డౌన్ ను విధించాలా లేదా అన్న అంశంపై ఒక తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారని తెలుస్తుంది. ఎక్కువ కేసులు వచ్చినంత మాత్రాన ప్రజలు భయపడొద్దని అందరికీ సరైన వైద్యం అందించి తీరుతామని కెసిఆర్ స్పష్టం చేసినట్టుగా ఇప్పుడు సమాచారం.