కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం కేసీఆర్ – కారణం అదేనేమో…?

Thursday, February 13th, 2020, 02:04:37 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం నాడు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లనున్నారు. ఈ మేరకు అక్కడ తుపాకుల గూడెం వద్ద ఉన్న ఆనకట్టను సీఎం కేసీఆర్ నిశితంగా పరిశీలించనున్నారు. అంతేకాకుండా తుపాకులగూడెం ఆనకట్టకు వనదేవత సమ్మక్క బ్యారేజి గా పేరును పెట్టనున్నారని ఇదివరకే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దానికి సంబందించిన జీవో జారీ చేయాల్సిందిగా ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌రావు కు పలు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ మరికొద్దిసేపట్లో హైదరాబాద్ నుండి బయలుదేరి, ఈరోజు రాత్రి కరీంనగర్ కి చేరుకొని, అక్కడ తీగలగుట్టపల్లిలోని వసతి గృహంలో బస చేయనున్నారు.

ఇక గురువారం నాడు ఉదయం అక్కడినుండి కాళేశ్వరం ప్రాజెక్టుకు చేరుకొని అక్కడి ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న తరువాత, మేడిగడ్డపై నిర్మించిన లక్ష్మీ ఆనకట్టను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఆనకట్ట కి సంబందించిన పూర్తీ వివరాల కోసం అక్కడి ఇంజనీర్లు, స్థానిక అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భాగంగా సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు వెల్లడించనున్నారని సమాచారం.