ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రముఖులకి ఆహ్వానం అందించిన కెసిఆర్

Saturday, June 15th, 2019, 03:17:35 AM IST

తెలంగాణాలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చివరికి విజయవంతంగా పూర్తయింది. కాగా తెలంగాణ ప్రజల ఈ చిరకాల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరు కావాలని తెలంగారా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీర్ గారు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ని కెసిఆర్ స్వయంగా ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం కీలకం కావడంతో ఆ రాష్ట్ర సీఎంను ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని కేసీఆర్‌ నిర్ణ యం తీసుకున్నారని సమాచారం. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ శుక్రవారం ముంబై రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ని కలుసుకొని మరీ ఆహ్వానించారు.

ముందుగా విద్యాసాగర్ రావు ని కలుసుకున్న కెసిఆర్, ఈనెల 21న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి వద్ద ప్రాజెక్టు ను ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని కోరారు. ఆ తరువాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో మాట్లాడిన కెసిఆర్, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు తమరు అందించిన సహాయం మరువలేనిదని, ఫడ్నవిస్‌ను సత్కరించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. వీరితో పాటు మరికొందరు ప్రముఖులను కెసిఆర్ స్వయంగా ఆహ్వానించారని, వారందరు కూడా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారని సమాచారం.