రంగు మారిందొచ్

Friday, September 12th, 2014, 05:55:13 PM IST


తెలంగాణ ముఖ్యమంత్రి కాన్వాయ్ కార్ల రంగు మారింది. భద్రతా కారణాల రిత్యా..వివిఐపిల వాహన శ్రేణిని సాధారణంగా నలుపురంగులోనే వినియోగిస్తుంటారు. కాని, ముఖ్యమంత్రి కెసిఆర్ నలుపు రంగు ఆచ్చిరావడం లేదని భావించి.. తన కాన్వాయ్ ను మార్చాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. ఆయన కాన్వాయ్ లోని మూడు బ్లాక్ ఫార్చూన్ కార్ల రంగును మార్చారు. తెలంగాణ రాష్ట్రం శాంతిగా ఉండాలనే కెసిఆర్ నిర్ణయంతో పోలీసు వాహనాలను తెలుపురంగులోకి మార్చారు.