ఆధార్ ఉంటేనే బంగారం..!

Tuesday, January 31st, 2017, 05:15:12 PM IST

gold
రూ 50 వేలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో బంగారం కొనాలంటే ఇక ఆధార్ లేదా పాన్ కార్డు నంబర్ లు తప్పనిసరి. బంగారం లేదా వెండి కొనుగోళ్లపై ఇకనుంచి ఆధార్ నంబర్ ని అనుసంధానం చేయనున్నట్లు సంబంధింత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. రేపు ప్రవేశ పెట్ట బోయో బడ్జెట్ లో ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం రూ 2 లక్షల కంటే ఎక్కువ పెట్టి బంగారం కొనుగోళ్లు చేస్తే బంగారం మార్కెట్ లో కేవైసీ కంప్లియన్స్ ని సమర్పించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం రూ 2 లక్షలకు పైబడిన కొనుగోళ్లకు ఉన్న ఈ నిబంధనని మరింత తగ్గించి రూ 50 వేలకు చేరుస్తారని దేశంలోనే అతిపెద్ద బులియన్ అసోసియేషన్ సెక్రటరీ భార్గవ్ వైద్య అంచనా వేస్తున్నారు.పెద్ద నోట్ల రద్దు అనంతరం చాలా మంది అక్రమార్కులు వారి నల్లధనాన్ని బంగారం కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్ వైపు మళ్లించారు. దీనితో ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారో తెలుసుకునే పనిలో ఐటి మరియు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిమగ్నమై ఉన్నారు.