మెగాస్టార్ సైరా కోసం .. రంగంలోకి కీరవాణి ?

Tuesday, December 5th, 2017, 03:51:22 PM IST

అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో తెరకెక్కుతున్న సైరా నరసింహ రెడ్డి సినిమా రేపటినుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటీకే అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమాకు పలువురు ప్రముఖ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కరు తప్పుకోవడం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ సినిమాకోసం సంచలన మ్యూజిక్ దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తాడని ప్రకటించారు .. కానీ ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా నుండి తప్పుకున్నాడట రహమాన్ ? దాంతో థమన్ పేరు వినిపిస్తుంది .. తాజాగా ఈ సినిమా కోసం ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని రంగంలోకి దింపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమాకు అద్భుతమైన సంగీతం అందించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన కీరవాణి తోడవడంతో ఈ ప్రాజెక్టు పై కొత్త ఆసక్తి పుట్టుకొస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments