ఇటు కీర్తి- అటు ఆలియా.. కెవ్వు కేక‌లే!

Wednesday, May 16th, 2018, 03:13:12 AM IST

న‌వ‌త‌రం నాయిక‌ల్లో ఎవ‌రిని న‌మ్మి క‌థ‌లు రాయొచ్చు? ఎవ‌రిని న‌మ్మితే బాక్సాఫీస్ రిట‌ర్న్స్ గ్యారెంటీ ఇవ్వ‌గ‌లం? అంటే ఓ ఇద్ద‌రు భామలు ప్ర‌స్తుతం జ‌నం దృష్టిలో ఉన్నారు. ఇటు సౌత్‌లో కీర్తి సురేష్‌, అటు నార్త్‌లో ఆలియా భ‌ట్‌. ఈ భామ‌లిద్ద‌రూ కెరీర్ ప‌రంగా స‌మ‌కాలీనులే. అలాగే సాధిస్తున్న విజ‌యాలు ఇంచుమించు ప్యార‌ల‌ల్‌గా క‌నిపిస్తున్నాయి. గ్లామ‌ర్ ఎలివేట్ చేయ‌గ‌ల‌రు. అవ‌స‌రం అయితే అభిన‌యంతో అంద‌రి మ‌న‌సులు దోచేయ‌గ‌ల‌రు.

మొన్న‌టికి మొన్న కేవ‌లం రెండ్రోజుల గ్యాప్‌తో కీర్తి సురేష్ న‌టించిన `మ‌హాన‌టి`, ఆలియా న‌టించిన `రాజీ` రిలీజ‌య్యాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్స్. ఇవి రెండూ 50కోట్ల క్ల‌బ్ సినిమాల జాబితాలో చేర‌నున్నాయి. ఆలియా న‌టించిన రాజీ చిత్రం కేవ‌లం 3రోజుల్లోనే 25కోట్ల వ‌సూళ్లు సాధించింది. ఈ సినిమాకి 34కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ సాగింది. అలానే కీర్తి సురేష్ మ‌హాన‌టి చిత్రానికి కేవ‌లం 3రోజుల్లో 17కోట్ల వ‌ర‌కూ షేర్ ద‌క్కింది. శాటిలైట్ ప‌రంగా ఏకంగా 11 కోట్లు మ‌హాన‌టి నిర్మాత‌ల‌కు ద‌క్కింది. 20కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ సాగింది ఈ సినిమాపై. ఇది అసాధార‌ణ‌మైన‌ది. ఈ రెండు సినిమాలు న‌వ‌ల‌ల ఇన్‌స్పిరేష‌న్‌తో తెర‌కెక్కిన‌వే. ఇక‌పోతే కీర్తి, ఆలియా ఇద్ద‌రినీ న‌మ్మి నిర్మాత‌లు క‌థ‌లు త‌యారు చేయించుకుని సినిమాలు తీయొచ్చు అన్న గ్యారెంటీ ఈ సినిమాలు ఇవ్వ‌గ‌లిగాయి.

  •  
  •  
  •  
  •  

Comments