`మ‌హాన‌టి`కి కంగారూల ఘ‌న‌స్వాగ‌తం

Thursday, August 9th, 2018, 02:27:29 PM IST

కంగారూ దేశంలో కాలు పెట్టాలంటే గ‌ట్స్ ఉండాలి. ఆ గ‌ట్స్ త‌న‌కు ఉన్నాయి కాబ‌ట్టే అక్క‌డి నుంచి ఆహ్వానం అందుకుంది మ‌న కీర్తి…. ఘ‌న‌కీర్తి. ఇంత‌కీ ఎవ‌రీ కీర్తి అంటారా? ఇంకెవ‌రో కాదు.. మ‌హాన‌టి కీర్తి సురేష్‌. న‌టి మేన‌క గారాల పుత్రిక‌. సావిత్రి కాని సావిత్రిగా ప్ర‌పంచ దేశాల్లో పాపులారిటీ తెచ్చుకున్న ఈ అంద‌గ‌త్తెకు ఆస్ట్రేలియా దేశం ఘ‌న‌స్వాగ‌తం ప‌లుకుతోంది. అక్క‌డ ఉన్న మ‌న ఎన్నారైలు ప్రేమ‌గా పిలుచుకున్నారు.

ప్ర‌తిష్ఠాత్మ‌క ఐఎఫ్ ఎఫ్ ఎం -2018 అవార్డుల్లో ఒకానొక అవార్డును క‌ట్ట‌బెట్టేందుకు కీర్తిని ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. ఈనెల 10 నుంచి 22 వ‌ర‌కూ.. అంటే 12 రోజుల పాటు మెల్‌బోర్న్ న‌గ‌రంలో సాగే ఈ ఫిలిం ఉత్స‌వాల్లో మ‌హాన‌టి చిత్రాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఇండియ‌న్ ఫిలింఫెస్టివ‌ల్ ఆఫ్ ఆస్ట్రేలియా -2018 వేడుక‌లుగా విశ‌దంగా చెబుతున్న ఈ వేడుక‌ల్లో కీర్తి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానుంది. ఇక‌పోతే కీర్తితో పాటు ఇంకెవ‌రు వెళుతున్నారు? అంటే హిచ్‌కీ లాంటి ప్ర‌యోగంలో అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న రాణీ ముఖ‌ర్జీ పుర‌స్కారం అందుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఫ్రిదా పింటో, మ‌లైకాల‌కు ఇన్విటేష‌న్ అందింది.

  •  
  •  
  •  
  •  

Comments