వై ఎస్ బయోపిక్ లో కీర్తి సురేష్ ?

Friday, March 23rd, 2018, 10:04:20 PM IST


తాజాగా టాలీవుడ్ లో బయోపిక్ సినిమాల హవా జోరందుకుంది. ఇప్పటికే అటు ఎన్టీఆర్, ఇటు పుల్లెల గోపీచంద్ ల బయోపిక్ లు సెట్స్ పైకి వచ్చాయి. తాజగా మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో సినిమాకు ప్లాన్ చేసాడు మహి వి రాఘవ్. వై ఎస్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలోని మిగతా పాత్రలకోసం నటీనటుల ఎంపిక జరుగుతుంది. వై ఎస్ భార్య విజయమ్మ పాత్రలో నయనతార నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక జగన్ పాత్రకోసం ఇప్పటికే ఇద్దరు యువ హీరోలను అడిగారని తెలిసింది. అయితే వారు ఈ పాత్ర చేయనని సున్నితంగా తిరస్కరించారని టాక్. తాజాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారని తెలిసింది. ఇంతకి కీర్తి సురేష్ పాత్ర ఎవరిదో తెలుసా ..జగన్ భార్య భారతి ది ? ప్రస్తుతం మహానటి సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ తో సదరు దర్శకుడు చర్చలు జరిపాడని టాక్. మరి ఈ పాత్రకోసం కీర్తి ఓకే అంతుందా లేదా అన్నది చూడాలి.