జయలలిత బయోపిక్ కోసం కూడా ఆమె పేరే ?

Tuesday, May 8th, 2018, 02:39:44 PM IST

తెలుగులో రూపొందుతున్న మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి చిత్రం రేపు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. సావిత్రి టైటిల్ పాత్రలో కీర్తి సురేష్ నటన, ఆమె అచ్చమైన రూపం అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత కీర్తి సురేష్ కోసం ఇంకొన్ని బయోపిక్ సినిమాలు ఎదురు చేస్తున్నాయి ? అవును మీరు వింటున్నది నిజమే .. కీర్తి సురేష్ తో మరో బయోపిక్ లో నటింపచేసే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతకీ ఆ బయోపిక్ ఎవరిదో తెలుసా .. తమిళ నటి .. మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర పై ఓ సినిమాను తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో జయలలిత పాత్రకోసం కీర్తి సురేష్ ని అడగడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయం పై కీర్తి సురేష్ ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదట. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా చెప్పింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తారట. మరి జయలలిత పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.