పవన్ ఫాన్స్ ని ఇలా సరిపెట్టుకోమన్నారా ?

Tuesday, October 17th, 2017, 08:23:22 PM IST

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాబినేషన్ లో వస్తున్న మూడో చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు టైటిల్ కోసం ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దసరాకు ఫస్ట్ లుక్ ఉంటుందనే వార్తలు అభిమానులని ఊరించాయి. కానీ దసరా వెళ్ళిపోయింది. దీపావళికి ఫస్ట్ రిలీజ్ ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. దీపావళి కూడా వచ్చేస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం పవన్ ఫాన్స్ కు నిరాశ తప్పేలా లేదు. దీపావళికి ఫస్ట్ లుక్ ఉండదని తెలుస్తోంది.

కానీ అభిమానులని కాస్త ఉత్సాహ పరిచేలా మాత్రం నిర్మాణ సంస్థ హారిక హాసిని ప్రయత్నిస్తోంది. సంగీత దర్శకుడు అనిరుద్ పుట్టిన రోజు సందర్భంగా జరిపిన స్పెషల్ ఇంటర్వ్యూ ని విడుదల చేశారు. కాగా నేడు చిత్ర హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం లోని ఆమె లుక్ ని విడుదల చేశారు. ఈ స్టిల్ లో కీర్తి సురేష్ సంప్రదాయ బద్దంగా కనిపిస్తూ చందమామలా వెలిగిపోతోంది. ఒంటిపై నగలు, చీరకట్టు తో కీర్తి సురేష్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments