మహానటి టీజర్: అందమైన అద్భుతం

Saturday, April 14th, 2018, 07:42:05 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని కీర్తిని గడించిన మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. కళ్లతోనే నవ్వగల ఆమె సౌందర్యం గురించి ఎంత పొగిడినా మాటలు చాలవు. అలంటి తార గురించి తెలుసుకోవడానికి ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. అయితే యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ఆ సినిమా కోసం ప్రస్తుతం చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేసింది. ‘అనగనగా ఒక మహానటి’ అంటూ స్టార్ట్ అయిన టీజర్ అద్భుతంగా ఉంది. చుసిన ప్రతి ఒక్కరు కీర్తి సురేష్ సావిత్రిలనే ఉందని చెబుతున్నారు. మే 9న రిలీజ్ కాబోతోన్న ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. సమంత – విజయ్ దేవరకొండ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments