కీర్తి అందుకే సంత‌కం చేయ‌లేద‌ట‌?

Wednesday, June 13th, 2018, 12:25:07 PM IST

అందాల క‌థానాయిక కీర్తి సురేష్ ప్ర‌స్తుతం సౌత్‌ని ఏల్తున్న సంగ‌తి తెలిసిందే. ఎంద‌రు స్టార్ హీరోయిన్లు ఉన్నా, అంద‌రినీ వెన‌క్కి నెట్టేసింది ఈ అమ్మ‌డు. మ‌హాన‌టి చిత్రంతో కీర్తి పేరు న‌లుమూల‌లా వ్యాపించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ అమ్మ‌డి అందానికి, న‌ట‌న‌కు ఫిదా అయిపోయారు. అస‌లు సావిత్రి అంటే కీర్తి. కీర్తి అంటే సావిత్రి అంటూ వోన్ చేసేసుకున్నారు. ఈ ప‌రిణామం కీర్తి ఊహించ‌నిది. కొత్త‌ది.. కావ‌డంతో చ‌క్క‌న‌మ్మ కొండెక్కి కూచోంటోందిట‌. ఇప్పుడు కొండ‌మీంచి కోతిని దించే ప్ర‌య‌త్నంలో ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఉన్నా.. అస్స‌లు స‌సేమిరా అంటోందిట‌.

అనూహ్యంగా వ‌చ్చిన క్రేజుతో ఈ అమ్మ‌డి ఆలోచ‌న‌లు పూర్తిగా మారిపోయాయ‌ని, రెగ్యుల‌ర్ మ‌సాలా సినిమాల‌కు అంగీక‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. అంతేనా.. చేస్తే గీస్తే ఏకంగా రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్‌లోనే న‌టించాల‌ని అనుకుంటోందిట‌. ఇదివ‌ర‌కూ మ‌హాన‌టి సినిమా చూసి కీర్తికి ప‌డిపోయాన‌ని రాజ‌మౌళి ప్ర‌క‌టించారు. దాంతో ఈ అమ్మ‌డు అత‌డి సినిమాలో అవ‌కాశం వ‌స్తుంద‌ని చాలానే ఆశ‌లు పెట్టుకుందిట‌. ఒక‌వేళ తార‌క్ లేదా చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఛాన్సిస్తే అస్స‌లు వదులుకునేందుకు సిద్ధంగా లేదుట‌. ఇంత‌కీ జ‌క్క‌న్న ఇస్తాడా ఛాన్స్‌?

  •  
  •  
  •  
  •  

Comments