సింగర్ గా టర్న్ ఇచ్చిన .. మహానటి ?

Wednesday, July 25th, 2018, 11:15:11 PM IST


తాజాగా మహానటి సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ కు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే అరడజను సినిమాలకు పైగా ఆఫర్స్ ఉన్నాయి. మహానటి సినిమాతో కీర్తి సురేష్ టాలెంట్ ఏమిటో అందరికి అర్థం అయ్యింది. ఇన్నాళ్లు గ్లామర్ భామగా చుసిన కీర్తి సురేష్ లోని నటిని పరిచయం చేసింది మహానటి. అయితే కీర్తిలో మరో కోణం ఉందన్న సంగతి ఈ మద్యే బయట పడింది. ఇంతకీ ఆ అవతారం ఏమిటో తెలుసా సింగర్ గా మారింది. అవునా ? అంటూ షాక్ అవుతున్నారా ? నిజమే కీర్తి సురేష్ తాజాగా విక్రమ్ సరసన స్వామి 2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఈ అమ్మడు ఓ సాంగ్ పాట పాడింది. హీరో విక్రమ్ తో కలిసి ఈ పాట పాడిందట. మలయాళ భామ అయినా కీర్తి తమిళం నేర్చుకుని మరి ఈ సినిమాలో సాంగ్ పాడడం విశేషం. హరి దర్శకత్వంలో గతంలో వచ్చిన సామి కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments